ఆరోగ్యానికి మేలుచేసే పెరుగు
- May 05, 2016
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి నీరు, కొబ్బరి బొండాం లాంటివి తీసుకుంటుంటాం. ఇవే కాకుండా శరీరాన్ని చల్లబరిచే పదార్థాల్లో పెరుగు కూడా ఉంది. దేహానికి శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో ఇది చాలా కీలకంగా పనిచేస్తుంది. పెరుగన్నం రెండున్నర గంటల వరకు ఆకలిని ఆపుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో పెరుగు తరచూ తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.. * ఒక వంతు పెరుగుకు నాలుగు వంతుల నీరు చేర్చి పలుచగా మజ్జిగలా చేసి తాగితే ఆర్యోగం పదిలంగా ఉంటుంది. పెరుగు తీసుకోవాల్సి వస్తే దానికి చక్కర, తేనె లేదా ఉసిరికాయలు చేర్చి తినవచ్చు. తిన్న ఆహారం విషతుల్యమైనా పెరుగును చక్కరతో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* గడ్డ పెరుగు కమ్మగా ఉందని అతిగా తీసుకుంటే అజీర్ణం చేసే అవకాశం ఉంది. పులిసిన పెరుగు తీసుకోవడం ఆరోగ్యకరం కాదు. స్థూలకాయం వస్తుందనుకునే వారు, ఇప్పటికే లావుగా ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండడమే మంచిది. * పెరుగు, శనగపిండి, వేపపొడి, చిటికెడు పసుపు చేర్చి నిత్యం నలుగు పెట్టుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మీగడ పెరుగు, తేనె కలిపి ఉదయాన్నే ముఖానికి పట్టిస్తే చక్కటి వర్చస్సు వస్తుంది. కోడిగుడ్డు పచ్చసొనతో పాటు కండిషనర్‌గా పెరుగును తలకు పట్టిస్తే శిరోజాల పెలుసుతనం తగ్గుతుంది. * అరికాళ్లు పలిగి రక్తం వస్తుంటే పెరుగు, నిమ్మరసం, వేపపొడి, పసుపు కలిపి పాదాలకు పట్టిస్తే సమస్యను తగ్గించవచ్చు. * పెరుగుకు నీటిని కలిపి తయారు చేసే మజ్జిగలోనూ అద్భుతమైన పోషక విలువలున్నాయి. పెరుగులో మీగడ తీసివేసిన తర్వాత ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వెన్న తీసిన గ్లాసు మజ్జిగలో 30 కేలరీల శక్తి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది వరప్రసాదం లాంటింది. * రాత్రి పూట అన్నంలో మజ్జిగ పోసి నానబెట్టి ఉదయం కొత్తిమీర, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల బక్కపలచగా ఉన్న వారు పుష్టిగా తయారవుతారు. మజ్జిగ జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అంతేకాదు శరీరానికి కాంతినిస్తుంది. ఇక ఇది గర్భిణులకు కూడా చాలా మంచిది. అధికంగా తీసుకుంటే వాతం చేస్తుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







