ప్రతిష్టాత్మకమైన రేసు చివరిదశకు చేరిన భారతీయ సాహసికుడు
- March 16, 2023
యూఏఈ: ఒక భారతీయ నావికుడు అభిలాష్ టోమీ తన యూఏఈ నమోదిత బోట్ బయానాట్లో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ యాచ్ రేసు ముగింపు రేఖకు చేరువలో ఉన్నాడు. అభిలాష్ టోమీ తొలిసారిగా 2018లో రేసులో పాల్గొన్నాడు. తుఫానులో పడవ దెబ్బతినడంతో 82 రోజుల తర్వాత 3వ స్థానంలో ఉన్నాడు. అతను వెన్నెముక గాయంతో ఇబ్బంది పడ్డాడు.ఇప్పుడు గెలవాలనే పట్టుదలతో తిరిగి రేసులోకి దూసుకొచ్చారు. రేసు 2022 సెప్టెంబర్ లో ప్రారంభమైంది. ఈ సంవత్సరం మేలో ఈ రేసు ముగుస్తుంది. అభిలాష్ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
రేసులో పాల్గొనే పోటీదారులు ఫ్రాన్స్‌లోని లెస్ సాబుల్స్-డి ఒలోన్నే నుండి బయలుదేరి ఐదు గ్రేట్ కేప్‌ల గుండా ఒంటరిగా, నాన్‌స్టాప్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించి.. వారి ప్రారంభ స్థానానికి తిరిగి వస్తారు. పోటీదారులు అసలు రేసు జరిగినప్పుడు 1968లో అందుబాటులో ఉన్న సాంకేతికతను మాత్రమే ఉపయోగించాలి. రేసులో తొమ్మిది మంది పాల్గొంటున్నారు.
గోల్డెన్ గ్లోబ్ రేస్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా వాయిస్ నోట్స్ ద్వారా అభిలాష్ టోమీ మీడియాతో మాట్లాడారు. ఒక సోలో సెయిలర్‌గా ప్రపంచాన్ని నాన్‌స్టాప్‌గా తిరుగుతున్నానని, ఈ క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. రేసు సమయాల్లో తీవ్ర గాలులు, గాయాలు, పడవ తెరలు చిరిగిపోవడం, నిద్రలేమి తదితర సవాళ్లు ఎదురవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్లో తాను ఎదుర్కొన్న కష్టతరమైన అడ్డంకి అని అభిలాష్ చెప్పారు. అభిలాష్ పరిశోధనా కార్యక్రమాలకు సహకరించేందుకు ఉత్సాహంగా ఉన్నానని అన్నారు మైక్రోప్లాస్టిక్స్ ఉనికిని, కాలుష్యాన్ని గుర్తించడానికి ప్రపంచ మహాసముద్రాల నుండి నీటి నమూనాలను సేకరించడం ద్వారా నేను బయానాట్కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..