ఫ్రీలాన్స్ వర్క్ పర్మిట్‌లను ప్రవేశపెట్టనున్న యూఏఈ!

- March 16, 2023 , by Maagulf
ఫ్రీలాన్స్ వర్క్ పర్మిట్‌లను ప్రవేశపెట్టనున్న యూఏఈ!

యూఏఈ: దేశంలో అన్ని నైపుణ్యాలు ఉన్నవారు ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే ఫ్లెక్సిబుల్ వర్క్ పర్మిట్‌ను యూఏఈ  పరిచయం చేయబోతోంది. ఈ కొత్త పర్మిట్ - 2023 మూడవ త్రైమాసికం నాటికి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫ్రీలాన్సర్‌లు దేశంలో లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా పని చేయడానికి ఈ కొత్త పర్మిట్ వీలు కల్పిస్తుంది. 2023 మూడో త్రైమాసికం నాటికి ఈ కొత్త పర్మిట్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని - దేశంలో లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండైనా ఫ్రీలాన్సర్లు పని చేసేందుకు వీలు కల్పిస్తుందని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రి అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ తెలిపారు. “మేము అన్ని నైపుణ్య స్థాయిల కోసం ఫ్రీలాన్సింగ్ వర్క్ పర్మిట్ అనే కొత్తదాన్ని పరిచయం చేయబోతున్నాం.అధిక నైపుణ్యం కలిగిన వ్యక్తులతో పాటు, తక్కువ నైపుణ్యం ఉన్నవారు కూడా తమ కోసం పని చేయడానికి, ఇతరులతో కలిసి పని చేయడానికి అనువైన వర్క్ పర్మిట్‌లను కలిగి ఉంటారు. " అని అల్ అవార్ దుబాయ్‌లో బుధవారం జరిగిన 'రిమోట్' ఫోరమ్‌లో వ్యాఖ్యానించారు.  

ఏప్రిల్ 2022లో యూఏఈ కొత్త వీసాలు, రెసిడెన్సీ పర్మిట్‌ల సంస్కరణలను ప్రకటించింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించడం, నిలుపుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు.

24,000 కొత్త ఉద్యోగాలు

ఇటువంటి సౌకర్యవంతమైన పని అవకాశాలతో 2024 నాటికి 24,000 ఉద్యోగాలు సృష్టించవచ్చని అల్ అవార్ చెప్పారు. ఇది విభిన్న నైపుణ్య స్థాయిలతో విభిన్న వ్యక్తులను ఆకర్షిస్తుందన్నారు. వ్యాపారాలు మరింత వైవిధ్యమైన శ్రామిక శక్తిని ఆకర్షిస్తాయని తెలిపారు. “మినిస్ట్రీలో రెండు వందల మంది రిమోట్‌గా పని చేస్తున్నారు. వీరిలో పురుషులు, మహిళలు ఉన్నారు. త్వరలో 24,000 ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా శ్రామిక శక్తిని పెంచాలని చూస్తున్నాం. మేము ఈ ధోరణికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము. మేము సహాయక చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉండటం ద్వారా శ్రామిక శక్తిని, మూలధనాన్ని ఆకర్షించాలనుకుంటున్నాము. ప్రైవేట్ రంగంలోనూ ఉత్పాదకత పెరుగుతుంది.’’ అని అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com