2 లక్షల 79 వేల 279 కోట్ల తో ఏపీ బడ్జెట్
- March 16, 2023
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టారు. ముందుగా శాసనసభలో మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ , కుతూహలమ్మ, పాతపాటి సర్రజుతో పాటు మరో ముగ్గురు సభ్యుల మృతి పట్ల సభ సంతాపం తెలిపారు. 2023–24 వార్షిక బడ్జెట్‌ను రూ.2,79,279 లక్షల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు.
- ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూల ధన వ్యయం రూ.31,061 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ.22,316కోట్లు, ద్రవ్యలోటు రూ.54,587 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. జీఎస్డీపీలో లోటు 3.7 శాతంగా పేర్కొన్నారు.
- మధ్యాహ్న భోజన పథకానికి రూ.1000 కోట్లు కేటాయింపు.అమెజాన్ మెగా ఫ్యాషన్ డేస్ | వాచీలు & స్మార్ట్ వాచీలపై కనీసం 60% తగ్గింపు
- పాఠశాలల్లో నాడు-నేడు పనుల కోసం రూ. 3,500 కోట్లు కేటాయింపు
- గడప గడపకూ మన ప్రభుత్వం కోసం రూ.532 కోట్లు
- ప్రత్యక్ష బదిలీ ద్వారా రూ.27,065 కోట్లు బదిలీ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.45 వేల కోట్లు
- వైఎస్సాఆర్ అభయ హస్తం పథకానికి రూ.21,275 కోట్లు కేటాయింపు.
- పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖలకు రూ.1,200 కోట్లు.. రైతు భరోసాకు రూ.4,000 కోట్టు
- మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.1,848 కోట్లు.. హోంశాఖకు రూ.8,206 కోట్లు కేటాయింపు
- 154 నియోజకవర్గాల్లో జంతు వ్యాధుల నిర్దారణ కేంద్రాలు.. ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6,165 కోట్లు
- బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.348 కోట్లు.. ఎస్టీల కార్పొరేషన్‌కు రూ.2,428 కోట్లు, క్రిస్టియన్ కార్పొరేషన్‌కు రూ.115.03 కోట్లు
- జగనన్న విద్యా దీవెన కోసం రూ.2,841.67 కోట్లు.. యువజన, పర్యాటక శాఖకు రూ.1,191 కోట్లు
- అమ్మ ఒడి కోసం రూ.6,500 కోట్లు, ఎనర్జీ రంగాన్ని రూ.6,456 కోట్లు.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు రూ.3,887 కోట్లు
- షెడ్యూల్ కులాల సంక్షేమానికి రూ.20,007 కోట్లు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి రూ.6,887 కోట్లు కేటాయింపులు
- వైఎస్సార్చేయూత రూ.5,000, వైఎస్సార్ ఆసరాకు 6,500 కోట్లు కేటాయింపు.
- వైస్సార్ వాహన మిత్రకు రూ.275 కోట్లు.. జగనన్న చేదోడు రూ.350 కోట్లు. వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.220 కోట్లు
- నీటి పారుదల శాఖకు రూ.11,908 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.9,000 కోట్లు
- పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.5,600 కోట్లు కేటాయింపు.. మైనార్టీల సంక్షేమం కోసం రూ.4,207 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధికి రూ.9,840 కోట్లు.. కాపు సంక్షేమానికి రూ.4887 కోట్లు..
- రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు
- మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు, లా నేస్తం కోసం రూ.17 కోట్లు, జగనన్న తోడు కోసం రూ.35 కోట్లు కేటాయింపు.
- జగనన్న వసతి దీవెనకు రూ.2,200 కోట్లు.. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.1,212 కోట్లు
- డ్యాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
- బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు. మొత్తం డీబీటీ స్కీంలకు రూ.54 వేల కోట్లకుపైగా కేటాయించారు.
- వైద్యం, ఆరోగ్యం కోసం రూ.15,882 కోట్లు.. జగనన్న విద్యా కానుకకు రూ.560 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.15,882 కోట్లు.
గతేడాది రెండు లక్షల 56 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెడితే.. ఈసారి మాత్రం రూ.2,79,279 లక్షల కోట్లను ప్రవేశ పెట్టింది.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్‌కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్‌లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









