హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు
- March 16, 2023
హైదరాబాద్: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL), నేడు 2023 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డులలో, తాము నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RGIA) 'భారతదేశం మరియు దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయం’గా గుర్తింపు పొందినట్లు ప్రకటించింది. అదే విధంగా హైదరాబాద్ విమానాశ్రయం ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్’ అవార్డు కూడా పొందింది.
దీనిపై GHIAL CEO ప్రదీప్ పణికర్, ““మా ప్రయాణీకులకు అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే మా నిబద్ధతకు గుర్తింపుగా మేము ఈ అవార్డును అందుకోవడానికి సంతోషిస్తున్నాము.మా ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మా విమానాశ్రయ సిబ్బంది, హైదరాబాద్ విమానాశ్రయంలో పనిచేస్తున్న భాగస్వాముల యొక్క కృషి, అంకితభావానికి ఈ అవార్డు నిదర్శనం. ఈ గుర్తింపు విమానాశ్రయ అనుభవాలను మరింత మెరుగుపరచడానికి మరియు సురక్షితమైన, నిరాటంకమైన అనుభవాన్ని అందించే మా నిబద్ధతను బలోపేతం చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది.’’ అన్నారు.
స్కైట్రాక్స్ సీఈఓ ఎడ్వర్డ్ ప్లాస్టెడ్, ‘‘2023కి సంబంధించి ఈ ముఖ్యమైన కస్టమర్ అవార్డులను గెలుచుకోవడంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విజయం సాధించినందుకు మేము అభినందిస్తున్నాము.గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కోవిడ్-19 మహమ్మారి నుండి బైట పడి, ప్రయాణీకుల సంఖ్య సాధారణ స్థితికి రావడం మరియు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తమ కస్టమర్లచే ప్రముఖ విమానాశ్రయంగా గుర్తించబడటం ఆనందంగా ఉంది.’’ అన్నారు.
విమానాశ్రయ పరిశ్రమలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. వీటిని కస్టమర్‌లు వార్షిక గ్లోబల్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ సర్వే ద్వారా ఎన్నుకుంటారు. 550 కు పైగా విమానాశ్రయాలలో కస్టమర్ సేవ మరియు సౌకర్యాలను అంచనా వేస్తూ, ప్రపంచ విమానాశ్రయ పరిశ్రమకు నాణ్యమైన బెంచ్‌మార్క్‌గా ఈ అవార్డులను పరిగణిస్తారు.ఈ సర్వేలను ఏ విమానాశ్రయ నియంత్రణకూ లోబడకుండా స్వతంత్రంగా నిర్వహిస్తారు.
ఈ అవార్డులను 6-నెలల సర్వే వ్యవధిలో 60 కంటే ఎక్కువ దేశాల విమానాశ్రయ కస్టమర్లు పూర్తి చేసిన వరల్డ్ ఎయిర్‌పోర్ట్ సర్వే ప్రశ్నాపత్రాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ సర్వే ద్వారా చెక్-ఇన్, రాకపోకలు, బదిలీలు, షాపింగ్, భద్రత మరియు ఇమ్మిగ్రేషన్ నుండి గేట్ వద్ద బయలుదేరే వరకు ఎయిర్‌పోర్ట్ సర్వీస్ యొక్క కస్టమర్ల అనుభవాన్ని, ఉత్పత్తి కీలక పనితీరు సూచికలను పరిశీలిస్తారు.
విమానయాన పరిశ్రమంలో వరల్డ్ ఎయిర్ పోర్ట్ స్టార్ రేటింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక అంతర్జాతీయ నాణ్యతా పరిశీలనా సూచిక. దీనిలో విమానాశ్రయాల నాణ్యతా ప్రమాణాలను ప్రత్యక్షంగా మరియు ప్రొఫెషనల్ అనాలసిస్ ద్వారా నిర్ధారిస్తారు. స్కైట్రాక్స్ 1999లో ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సాటిస్‌ఫ్యాక్షన్ సర్వేను ప్రారంభించిన నాటి నుంచి ఈ ప్రపంచ ఎయిర్ పోర్టుల అవార్డులు ఇవ్వడం ప్రారంభమైంది. ఎయిర్‌పోర్టులలో చెకిన్, అరైవల్స్, ట్రాన్స్ ఫర్స్, షాపింగ్, సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ తదితర చోట్ల ప్రయాణికులకు లభించే ఎయిర్ పోర్ట్ సేవలు మొదలైన వాటి ఆధారంగా సర్వే నిర్వహించి, విజేతలను ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!