ఒమన్‌లో కనీస వేతనంపై కార్మిక శాఖ సమీక్ష
- March 20, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో కనీస వేతనాన్ని OMR 360కి పెంచడానికి సమీక్ష కొనసాగుతోందని కార్మిక మంత్రి మహద్ బావిన్ ధృవీకరించారు. సమీక్షకు సంబంధించిన అంశాలలో సగటు నెలవారీ వేతనాలు, వార్షిక ద్రవ్యోల్బణం రేటు కూడా ఉన్నాయని తెలిపారు. ఒమన్ సుల్తానేట్‌లో కనీస వేతనం OMR 360-400 మధ్య ఉంటాయని భావిస్తున్నారు. వాస్తవానికి కార్మిక మంత్రిత్వ శాఖ 2020లో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయ డిగ్రీలు ఉన్నవారికి దీని కారణంగా అన్యాయం జరుగుతుందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అనంతరం మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వేతనాలను అర్హతలతో ముడిపెట్టరాదని మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఒమానిసేషన్ రేట్లను పెంచడం, పౌరులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడం కోసం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







