'వన్ బిలియన్ మీల్స్'ని ప్రకటించిన షేక్ మహ్మద్
- March 20, 2023
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 'వన్ బిలియన్ మీల్స్'ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 50 దేశాల్లోని బలహీనమైన కమ్యూనిటీలకు ఆహార సహాయాన్ని పొందేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడతారు. "ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు. రాబోయే దశాబ్దాల పాటు స్థిరమైన రీతిలో వందల మిలియన్ల భోజనాన్ని అందించడం మా చొరవ లక్ష్యం." అని షేక్ మహ్మద్ తన ట్వీట్‌లో తెలిపారు. షేక్ మహ్మద్ అరబిక్‌లో ట్వీట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. “సోదర సోదరీమణులారా.. పవిత్ర మాసం ప్రారంభంలో మా వార్షిక సంప్రదాయం ప్రకారం.. రమదాన్ లో 'వన్ బిలియన్ మీల్స్' ఎండోమెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ” అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







