మొటిమలకు గుమ్మడి గింజల టిప్.! ఎలాగో తెలుసా.?
- March 20, 2023
మొటిమలు యవ్వనంలో వున్న యువతీ యువకులను బాధించే ప్రధాన సమస్యల్లో ఒకటి. హార్మోనల్ ఛేంజింగ్ కారణంగా యవ్వనంలో మొటిమలు రావడం సర్వ సాధారణం. అయితే, కొందరిలో ఈ సమస్య తక్కువగా వుండొచ్చు. ఇంకొందరిలో భరించలేనంగా బాధించొచ్చు.
మార్కెట్లో మొటిమల కోసం అనేక ఫేస్ క్రీమ్‌లు అందుబాటులో వున్నాయ్. కానీ, వాటితో మంచితో పాటూ, చెడుకే ఎక్కువ ఆస్కారం వుంది.
అందుకే, ఇంట్లో సహజ సిద్ధమైన రెమిడీతో మొటిమల్నీ, వాటి వల్ల కలిగే నల్ల మచ్చల్నీ ఈజీగా తొలిగించుకోవచ్చు.
ఎండబెట్టిన గుమ్మడి గింజల్ని మిక్సీలో వేసి పేస్ట్లులా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కి కాస్త తేనె, యాపిల్ వెనిగర్ మిక్స్ చేసుకోవాలి. వెనిగర్ అందుబాటులో లేకుంటే రెండు చుక్కల నిమ్మరసమైనా ఉపయోగించొచ్చు.
ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటూ, మెడకూ అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలతో పాటూ, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తొలిగిపోతాయ్. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. వారానికి 1 లేదా 2 సార్లు ఇలా చేస్తే క్రమ క్రమంగా మచ్చలు మానిపోతాయ్.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం