కువైట్ ఆయిల్ కంపెనీలో చమురు లీకేజీ.. అత్యవసర పరిస్థితి ప్రకటన

- March 20, 2023 , by Maagulf
కువైట్ ఆయిల్ కంపెనీలో చమురు లీకేజీ.. అత్యవసర పరిస్థితి ప్రకటన

కువైట్: కువైట్‌కు పశ్చిమాన ఉన్న ప్రాంతంలో చమురు లీకేజీ కారణంగా కువైట్ ఆయిల్ కంపెనీ (KOC) అధికారులు సోమవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.లీకేజీ వల్ల కొందరు సిబ్బందికి గాయాలు అయ్యాయని అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డిప్యూటీ సీఈఓ, KOC అధికారిక ప్రతినిధి ఖుసై అల్-అమెర్ తెలిపారు. కాగా, సంఘటన స్థలంలో విషపూరిత వాయువు ఆనవాళ్లను గుర్తించలేదని, ప్రస్తుతం KOC బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. సంఘటన స్థలంలో పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు అల్-అమెర్ వెల్లడించారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com