దుబాయ్ ఎంట్రప్రెన్యూవర్‌గా మారిన కార్తిక నాయర్
- March 20, 2023
దుబాయ్: సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్ కూడా వెండితెరకు పరిచమైంది. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో కలిసి దమ్ము సినిమాలో నటించింది.తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించినప్పటికీ 10కి పైగా సినిమాల్లో నటించలేకపోయింది. అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ వైపు పయనం మొదలు పెట్టింది.
ఈ క్రమంలోనే ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టింది.ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో కొన్ని సంవత్సరాలుగా కార్తిక విశేషమైన పాత్ర పోషించింది.దీంతో కొన్నాళ్లుగా దుబాయ్ లోనే స్థిరపడి పోవడంతో.. అక్కడి ప్రభుత్వం యంగ్ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తించి గోల్డెన్ వీసా అందజేశారు. దుబాయ్‌లోని టూఫోర్ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యూఏఈకి చెందిన హమద్ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్ వీసాను అందజేశారు.ఈ సందర్భంగా కార్తీక తన ఆనందం వ్యక్తం చేసింది.‘‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది’’ అంటూ పేర్కొంది.
కార్తిక తల్లి రాధ గురించి పరిచయం అవసరం లేదు.1980ల్లో ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణించింది.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆమె నటించింది.నటిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి గతంలో రాధకు కూడా గోల్డెన్ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే.కేరళలోనూ ఉదయ్ సముద్ర గ్రూప్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సంస్థలు ఉన్నాయి.తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తిక తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..