వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలు..హాజరైన ప్రధాని మోదీ
- March 20, 2023
న్యూఢిల్లీ: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, న్యూఢిల్లీలోని తమ అధికారిక నివాసంలో ఉగాది మిలన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఉగాదిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలను తిలకించిన ప్రధానమంత్రి, మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఢిల్లీలో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకయ్యనాయుడు వారి శ్రీమతి ఉషమ్మ, కుమార్తె శ్రీమతి దీపావెంకట్ సహా ఇతర కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, పూర్వ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సుప్రీం కోర్ట్ పూర్వ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, రాజ్యసభ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!