ఒమన్ మదర్స్ డే: శుభాకాంక్షలు తెలిపిన ది హానరబుల్ లేడీ అస్సాయిదా

- March 21, 2023 , by Maagulf
ఒమన్ మదర్స్ డే: శుభాకాంక్షలు తెలిపిన ది హానరబుల్ లేడీ అస్సాయిదా

మస్కట్: మార్చి 21న వచ్చే మదర్స్ డే సందర్భంగా ఒమన్ సుల్తాన్ జీవిత భాగస్వామి హర్ హైనెస్ ది హానరబుల్ లేడీ అస్సాయిదా అహ్ద్ అబ్దుల్లా హమద్ అల్ బుసాయిదీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. “ఒక తల్లి త్యాగాలకు ప్రతీక. మదర్స్ డే సందర్భంగా, కుటుంబానికి మర్యాదపూర్వకమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడానికి కృషి చేసిన ప్రతి తల్లికి మా హృదయపూర్వక అభినందనలు. తమ పిల్లలను పెంచడంలో.. వారి క్షేమం కోసం కష్టాలను సహిస్తూ నిజాయితీగా కృషి చేసిన ప్రతి తల్లికి నా నమస్కారాలు.  ఒమన్ లోని తల్లులందరికీ నా శుభాకాంక్షలు.’’ అని తన ప్రకటనలో ది హానరబుల్ లేడీ అస్సాయిదా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com