పలు సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా!
- March 21, 2023
యూఏఈ: ఇండియాలోని కోజికోడ్, ఇండోర్, గోవాలకు అనేక సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. వాటి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులను ప్రకటించింది. దీంతో భారతదేశానికి వెళ్లాలనుకునే వారికి మార్చి 26 నుండి విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ప్రతినిధి పి.పి. సింగ్ తెలిపారు. త్వరలోనే ఢిల్లీ, ముంబాయి వంటి ప్రధాన నగరాలకి కూడా విమాన సర్వీసులను రీ షెడ్యూల్ చేస్తామని పేర్కొన్నారు. స్థానిక ట్రావెల్ ఏజెంట్ల ప్రకారం.. ఈ మార్పు గురించి ఇప్పుడే వార్తలు వచ్చినా.. భారతదేశంలోని అనేక నగరాలకు విమాన ధరలు ఇప్పటికే పెరిగాయని తెలిపారు. ఈ వేసవిలో ప్రయాణించాలని చూస్తున్న వారు టిక్కెట్ల కోసం చాలా ఎక్కువ ధరను చెల్లించవలసి ఉంటుందని స్మార్ట్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ అన్నారు. వీల్‌చైర్‌లలో ప్రయాణించే వారిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఏకైక భారతీయ విమానం ఎయిర్ ఇండియా మాత్రమే కాబట్టి వారు మరింత ఇబ్బందికర పరిస్థితి అని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష