1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ అధ్యక్షుడు
- March 21, 2023
యూఏఈ: రమదాన్ మాసాన్ని పురస్కరించుకొని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 1,025 మంది ఖైదీలను జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించారు. ముఖ్యమైన ఇస్లామిక్ సందర్భాలలో యూఏఈలోని ప్రతి ఎమిరేట్‌ల పాలకులు ఖైదీలకు క్షమాభిక్ష పెడుతుంటారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు సామాజిక, వృత్తిపరమైన జీవితాలను గడపడానికి వీలుగా వారికి ఒక అవకాశం కల్పిస్తూ.. క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఈరోజు చంద్రుడు కనిపిస్తే.. పవిత్ర మాసం మార్చి 22 (బుధవారం) నుంచి ప్రారంభమవుతుంది. లేదంటే మార్చి 23 ( గురువారం) నుండి నెల ప్రారంభమవుతుంది. ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం రమదాన్ నెల ఉపవాసాలు చంద్రుడు కనిపించే సమయాన్ని బట్టి 29 లేదా 30 రోజులపాటు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







