'సంతోషకరమైన' అరబ్ దేశాలుగా యూఏఈ,సౌదీ, బహ్రెయిన్
- March 21, 2023
బహ్రెయిన్: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం.. 2020 నుండి 2022 వరకు యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ సంతోషకరమైన అరబ్ దేశాలుగా నిలిచాయి. కొవిడ్-19 సంక్షోభ సమయాల్లో ‘‘సంతోషం, నమ్మకం ,సామాజిక సంబంధాలు" అనే పేరుతో రూపొందించిన నివేదిక తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. జీవిత మూల్యాంకనాలు, సానుకూల భావోద్వేగాలు, ప్రతికూల భావోద్వేగాలు వంటి పారామీటర్ల ప్రాతిపదికన హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లను కేటాయించారు. మొత్తం 137 దేశాలలో సర్వే నిర్వహించగా.. టాప్ అరబ్ దేశాల్లో(మొత్తం 13 అరబ్ దేశాల జాబితా) మొదటి మూడు దేశాలుగా యూఏఈ- 26, సౌదీ అరేబియా -30, బహ్రెయిన్ -42 నిలిచాయి. ఆర్థిక అస్థిరత రాజకీయ సంక్షోభంతో బాధపడుతున్న లెబనాన్(అరబ్ దేశాలలో) 137 దేశాలలో చివరి నుంచి రెండవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







