వచ్చే ఏడాది భారత్ దేశం వ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో వైఫై
- May 06, 2016
దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో వచ్చే ఏడాదికి వైఫై సదుపాయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. వైఫై ద్వారా ఇంటర్నెట్ చాలా ఎక్కువ వేగంతో ఇస్తామని ప్రకటించారు. 400 స్టేషన్లలో వైఫై అందించడానికి గూగుల్‌తో అనుసంధానమైనట్లు చెప్పారు. ముంబయి సెంట్రల్ స్టేషన్ నుంచి ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తవుతుందన్నారు. పబ్లిక్ వైఫైలలో ప్రపంచంలోనే వేగంగా ఇంటర్నెట్ అందిస్తున్నట్లు విశాఖపట్నం, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో నిరూపణ అయిందన్నారు.
వైఫై సదుపాయం కోసం రైల్వే గూగుల్‌తో పాటు ఇతర ఆపరేటర్ల సహాయం కూడా తీసుకుంటోందని సురేశ్ ప్రభు అన్నారు. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లో టెర్మినల్ అభివృద్ధి గురించి.. చర్చిగేట్ నుంచి శివాజీ టెర్మినల్‌కు కనెక్టివిటీ గురించి ఏప్రిల్ 21న మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు చర్చించామన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







