చిరునామా లేని 16,848 కంపెనీ ఫైల్స్ సస్పెండ్..
- March 26, 2023
కువైట్: చెల్లుబాటు అయ్యే పౌర చిరునామాలు లేని 16,848 కంపెనీల ఫైళ్లను కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM) సస్పెండ్ చేసింది. ఆర్టికల్ 18 కింద ఈ కంపెనీల క్రింద 61,688 మంది కార్మికులు నమోదు చేసుకున్నారని తెలిపింది.కాగా కార్మికులు వారి చట్టపరమైన స్థితిని పునరుద్దరించటానికి ఒక నెల గ్రేస్ పీరియడ్‌ను ఇచ్చినట్లు అథారిటీ పేర్కొంది. "ప్రైవేట్ రంగంలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించేవారిపై నియంత్రణను కఠినతరం చేయాలని" మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు PAM తెలిసింది. అయితే, నిర్దిష్ట వ్యవధిలోగా చట్టపరమైన స్థితిని సరిదిద్దడంలో కంపెనీలు విఫలమైతే, యజమానులపై సంబంధిత దర్యాప్తునకు రిఫర్ చెయ్యనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







