నకిలీ వార్తలు, పుకార్లు వ్యాప్తి చేస్తే.. 200,000 దిర్హాంలు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష..!

- March 26, 2023 , by Maagulf
నకిలీ వార్తలు, పుకార్లు వ్యాప్తి చేస్తే.. 200,000 దిర్హాంలు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష..!

యూఏఈ: యూఏఈలో ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేయడం వల్ల కలిగే పరిణామాలు, జరిమానాల గురించి రస్ అల్ ఖైమా పోలీసులు రిమైండర్ జారీ చేశారు.UAE చట్టం ప్రకారం నేరస్థుడికి ఒకటి నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 200,000 దిర్హాంలు జరిమానా విధించబడుతుంది. 
- అధికారికంగా ప్రకటించిన వాటికి విరుద్ధంగా తప్పుడు వార్తలు లేదా డేటా ప్రచురించడం, తప్పుదారి పట్టించే లేదా తప్పుడు పుకార్లు లేదా నివేదికలను ప్రకటించడం, ప్రచారం చేయడం నిషిద్ధం.
- ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించే లేదా రెచ్చగొట్టే, ప్రజా శాంతికి భంగం కలిగించే, ప్రజలలో భయాందోళనలను వ్యాప్తి చేసే లేదా ప్రజా ప్రయోజనాలకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా క్రమానికి లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏదైనా రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేయడం నేరం.
ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తికి జరిమానా Dh100,000 జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది. అదేవిధంగా సంస్థలు లేదా అధికారులపై ప్రజల అభిప్రాయాన్ని ప్రేరేపించడం, రెచ్చగొట్టడం లేదా అంటువ్యాధులు, సంక్షోభ పరిస్థితుల సమయంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే Dh200,000 జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించి అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com