సైబర్ లాస్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం..

- March 27, 2023 , by Maagulf
సైబర్ లాస్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం..

హైదరాబాద్: సైబర్ క్రైం ఫ్యూచర్ క్రైం అని తెలంగాణ రాష్ట్ర సిఐడి ఎడిజి మహేష్ భగవత్ అన్నారు.ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో జూనియర్ సివిల్ జడ్జిలకు సైబర్ లాస్, సైబర్ క్రైంల పై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సిఐడి ఎడిజి మహేష్ భగవత్ సోమవారం ప్రారంభించారు. జూనియర్ జడ్డిలకు రిటైర్డ్ ఐజిపి ఉమాపతి, సైబర్ లా నిపుణుడు ,టెక్నో లీగల్ కన్సల్టెంట్ సాయిసుశాంత్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు శ్రీనివాస్, డిఎస్‌పి రవికుమార్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ పద్మ శిక్షణ ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా సిఐడి ఎడిజి మహేష్ భగవత్ మాట్లాడుతూ సైబర్ క్రైం ఫ్యూచర్ క్రైం అని, ప్రతి అధికారి సైబర్ నేరాలను గురించి తెలుసుకోవాలని అన్నారు.

ఇంటర్‌నెట్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ సైబర్ నేరస్థులు బారినపడే అవకాశం ఉందని అన్నారు. ఓ బాధితుడు సోషల్ మీడియాలో అవయవదానంపై వచ్చిన యాడ్ చూసి సైబర్ నేరస్థులో ఎలా మోసపోయాడో వివరించారు.సైబర్ నేరస్థుడు బాధితుడి నుంచి అవయవం తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు.యువకులు ఉద్యోగాల కోసం ఇంటర్ నెట్‌లో వెతుకుతూ సైబర్ నేరస్థుల ఉచ్చులో పడుతున్నారని తెలిపారు. సిసిపిడబ్లూలోని కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఎంసిహెచ్‌ఆర్‌డిలో 30మంది జడ్జిలకు సైబర్ నేరాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఎంసిహెచ్‌ఆర్‌డి డైరెక్టర్ శ్రీదేవి, సిఐడి డిసిపి యాదగిరి, సిఐడి ఎస్‌పి లావణ్య, డిఎస్పి గుణశేఖర్, ఐటి ఫ్యాకల్టీ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com