టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం

- March 27, 2023 , by Maagulf
టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం

పారిస్: టిక్‌టాక్‌ ను ఫ్రాన్స్ ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది. ప్రైవ‌సీ, సెక్యూర్టీ స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొనేందుకు ఆ ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌కు దిగింది. ప్ర‌భుత్వ డివైస్‌ల‌లో టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎవ‌రూ ఆ యాప్‌ను వాడ‌రాదు అని ఫ్రెంచ్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప‌బ్లిక్ స‌ర్వీస్ మంత్రి స్టానిస్లాస్ గ్వెరిని ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ప‌రిపాల‌నా యంత్రాంగం సైబ‌ర్ సెక్యూర్టీ అంశంలో ఈ చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల ప్రొఫెష‌న‌ల్ ఫోన్ల‌లో టిక్ టాక్ లాంటి రిక్రియేష‌నల్ అప్లికేష‌న్ల‌ను బ్యాన్ చేస్తున్న‌ట్లు చెప్పారు.

కాగా, ఇండియాలోనూ టిక్ టాక్‌పై బ్యాన్ ఉన్న విష‌యం తెలిసిందే. మ‌న దేశంలో 2020 నుంచి టిక్ టాక్‌తో పాటు వీచాట్‌ను కూడా బ్యాన్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com