కారు ప్రమాదంలో గాయపడ్డ రెండేళ్ల బాలుడు మృతి
- March 29, 2023
యూఏఈ: అజ్మాన్లోని అల్ నుయిమియా ప్రాంతంలో రమదాన్ రెండవ రోజున కారుకింద పడి తీవ్రంగా గాయపడిన రెండేళ్ల అరబ్ పిల్లవాడు.. చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మరణించాడు. అల్ నుయిమియాలోని ఒక విల్లాలో బాలుడి కుటుంబం నివాసం ఉంటుంది. అతని తండ్రి తన కారు నుండి కొన్ని వస్తువులను తెచ్చేందుకు వెళ్లాడు. అతని వెంటే బాలుడు పరుగెత్తి వెళ్లగా తండ్రి గమనించలేదు.. ఈ క్రమంలోనే ఓ అరబ్ జాతీయుడు నడిపే కారు బాలుడిని ఢీకొట్టింది. మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న తన చిన్నారి కోలుకోవాలని ప్రార్థించాలని ప్రజలను అభ్యర్థిస్తూ చిన్నారి తల్లి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. మరణించిన అబ్బాయి ఆమెకు చిన్న సంతానం. తన కొడుకు మరణించిన విషయాన్ని కూడా ఆమెనే ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు