పన్నులు పెంచి, టొబాకో వినియోగం తగ్గించాలి
- May 07, 2016
ఒమన్‌లో టొబాకో ఉత్పత్తుల వినియోగం తగ్గించడానికి టొబాకో ఉత్పత్తులపై అధికంగా పన్నులు విధించాలని మజ్లిస్ అల్ షురా సభ్యులు అభిప్రాయపడ్డారు. పన్నుల్ని 200 శాతం వరకు ఈ విభాగంలో పెంచాలని మజ్లిస్ అల్ షురా హెల్త్ కమిటీ మెంబర్ మొహమ్మద్ బాకి చెప్పారు. ప్రపంచంలో టొబాకో ఉత్పత్తులపై పన్నులు పెంచిన వివిధ దేశాలు, టొబాకో వాడకాన్ని గణనీయంగా తగ్గించగలిగాయని ఆయన వివరించారు. నేషనల్ టొబాకో కంట్రోల్ కమిటీ డాక్టర్ జవాద్ అల్ లవాతి మాట్లాడుతూ, టొబాకో ఉత్పత్తుల వాడకం తగ్గించడం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచగలమని చెప్పారు. ప్రాణాంతక వ్యాధులకు సామాన్యులు గురవుతున్నారని ఇందులో సింహభాగం టొబాకో ఉత్పత్తుల వల్లేనని ఆయన వివరించారు. క్యాన్సర్, గుండెపోటు వంటి వ్యాధులకు పొగాకు ఉత్పత్తులు ప్రధాన కారణమని ప్రముఖ వైద్యులు వివరించారు. పన్నుల పెంపకంతోపాటు, టొబాకో ఉత్పత్తులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం ఉత్తమమని వారు చెప్పారు.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









