‘మీటర్’తో కిరణ్ అబ్బవరం రేంజ్ మారిపోనుందిగా.!
- March 30, 2023
ఇటీవల యంగ్ హీరోల్లో తనదైన గుర్తింపు దక్కించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు రాణి వారు’ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ కుర్రోడు, సినిమాలపై పిచ్చితో, సాఫ్ట్‌వేర్ వుద్యోగాన్ని సైతం వదిలిపెట్టి వచ్చాడు.
అనుకున్నట్లుగానే నటనలో తనదైన కొత్త శైలి చూపిస్తున్నాడు. అతి తక్కువ టైమ్‌లోనే యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. యూత్‌తో పాటూ, మేకర్లను బాగా ఇంప్రెస్ చేస్తున్నాడు.
అందుకే వరుస పెట్టి సినిమాలు చేయడమే కాదు, ఒకదాని తర్వాత ఒకటి కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలు ధియేటర్లలో సందడి చేస్తున్నాయ్.
ఇటీవలే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో హిట్టు కొట్టేశాడు. ఇక, ఏప్రిల్ 7 న ‘మీటర్’ సినిమాతో రాబోతున్నాడు. రమేష్ కడూరి అనే కొత్త డైరెక్టర్‌ని ఈ సినిమాతో దించుతున్నాడు. పోలీస్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా ఇది.
కమర్షియల్‌గా బాగానే వర్కువుట్ అయ్యేలా కనిపిస్తోంది. అతుల్య రవి ఈ సినిమాలో కిరణ్‌తో జోడీ కడుతోంది.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్