దసరాని టార్గెట్ చేసిన మాస్ రాజా.!
- March 30, 2023
ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మాస్ రాజా తన సత్తా చాటాడు. తిరుగులేని హిట్ అందుకోవడంతో పాటూ, మాస్ రాజా ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు ఈ సినిమాతో.
ఇక, ఇదే ఊపులో తాను కమిట్ అయిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసే పనిలో బిజీగా వున్నాడు మాస్ రాజా రవితేజ.
అందులో భాగంగానే ‘రావణాసుర’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధంగా వుంది. వచ్చే నెల మొదటి వారంలో ‘రావణాసుర’ రిలీజ్ కానుంది.
కాగా, ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రలో కనిపించబోతున్న సంగతి ప్రచార చిత్రాలు చూస్తే అర్ధమవుతోంది. అందులో ఒకటి నెగిటివ్ షేడ్ రోల్ కూడా. అలాగే, ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మలతో ఈ సినిమా కోసం ఆడి పాడబోతున్నాడు రవితేజ
ఇదిలా వుంటే, ఆయన నటించిన మరో కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 21న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు.
రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్