సినిమా రివ్యూ: ‘దసరా’

- March 30, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘దసరా’

నటీనటులు: నాని, కీర్తి సురేష్, దినేష్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, ఝాన్సీ, చాకో తదితరులు.

స్టోరీ, స్క్రీన్‌ప్లే డైరెక్షన్: శ్రీకాంత్ ఓదెల,
మ్యూజిక్ సంతోష్ నారాయణన్,
నిర్మాత: సుధాకర్ చెరుకూరి,

నాని, కీర్తి సురేష్ జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. పక్కా మాస్, ఊర మాస్ చిత్రంగా ‘దసరా’ని ప్రమోట్ చేశారు. ‘దసరా’ సినిమా ద్వారా కొత్త నానిని చూడబోతున్నామన్న ఫీల్ క్రియేట్ చేశారు ప్రచార చిత్రాల ద్వారా. ‘పుష్ప’ బ్యాక్ డ్రాప్ కనిపించింది ‘దసరా’ ప్రచార చిత్రాలు చూస్తుంటే. మరి, అదే ఫీల్ ‘దసరా’ సినిమా క్రియేట్ చేసిందా.? లేక, తనదైన కొత్త ఫీల్ చూపించిందా.? తెలియాలంటే ‘దసరా’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
ఓ పల్లెటూరు.. ఓ సారాయి కొట్టు.. ముగ్గురు స్నేహితులు, ఊరి పెద్ద సర్పంచ్.. ఇలా సహజ సిద్ధమైన పాత్రల మధ్య ‘దసరా’ సినిమా ట్రాక్ నడుస్తుంటుంది. ధరణి (నాని), సూర్య (దినేష్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) ముగ్గురూ చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. స్నేహితుడు సూర్య కోసం తాను ప్రేమించిన వెన్నెలనే త్యాగం చేస్తాడు ధరణి. సర్పంచ్ పదవి కోసం ఊరిలోని రెండు పెద్ద తలకాయల మధ్య జరిగే పోరు, ఆ పాలిటిక్స్‌కీ, ఈ ముగ్గురు స్నేహితుల జీవితాలకీ మధ్య లింకేంటీ.? ఆ ఇష్యూతో ఈ స్నేహితుల జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయ్.? తెలియాలంటే ‘దసరా’ సినిమా తెరపై చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
నో డౌట్ నాని, కీర్తి సురేష్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. నెక్స్‌ట్ లెవల్ పర్‌ఫామెన్స్ ఇచ్చారు. ఇంతవరకూ క్లాస్ పాత్రలే సూటవుతాయ్ నానికి.. అన్న వాళ్లంతా ‘దసరా’ చూశాకా తమ అభిప్రాయాన్ని మార్చుకోవల్సి వస్తుంది. అంతలా మాస్ ఎలివేషన్స్‌లో చితక్కొట్టేశాడు నాని. కీర్తి సురేష్ గట్టి పోటీ ఇచ్చింది. స్నేహితుడి పాత్రలో నటించిన దినేష్ శెట్టి బాగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో నానిని డామినేట్ చేసేశాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ఎమోషన్లు క్యారీ చేయడంలో ఎవరికి వారే తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పని తీరు:
తాను అనుకున్న కథని అనుకున్నట్లుగానే తెరపై ఆవిష్కరించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. అయితే, ఇంత బరువైన కథను ఎంచుకున్నప్పుడు అనుభవ రాహిత్యం అనేది సుస్పష్టంగా కనిపించింది. కొన్ని ఎమోషన్ సన్నివేశాల్లో ఆడియన్స్‌ని కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, కొత్త డైరెక్టర్ నుంచి ఈ స్థాయి అవుట్ పుట్ అంత ఆషా మాషీ కాదు. ఆ విషయంలో శ్రీకాంత్‌కి ఎక్కువ మార్కులు పడుతున్నాయ్. ‘రంగస్థలం’ సినిమా తరహా పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్.
అయితే, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లోని యాక్షన్ ఎపిసోడ్ సినిమాని నిలబెట్టేశాయ్. విజువల్‌గా ఈ రెండు యాక్షన్ బ్లాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇక, సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్‌లో ఒక్క పాట తప్ప పెద్దగా గుర్తు పెట్టుకునేంత వినిసొంపుగా అనిపించలేదు. విజువల్‌గా ఓకే అంతే. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. అది ఇంకాస్త బలంగా వుంటే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. అక్కడక్కడా డైలాగ్స్ హృద్యంగా వుంటాయ్. ఎడిటింగ్ ఓకే. 

ప్లస్ పాయింట్స్:
నాని, కీర్తి సురేష్, దినేష్ శెట్టి పర్‌ఫామెన్స్,
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టేకింగ్, స్టోరీ రైటింగ్,
ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లో పతాక సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా తేలిపోయిన ఎమోషనల్ సీన్లు, 

ఫైనల్‌గా: ‘దసరా’ నాని, కీర్తి సురేష్ మాస్ ఊర మాస్ జాతర.

గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్: Phars Film Co. LLC

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com