కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ
- March 30, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ టూర్ లో సీఎం జగన్..కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను జగన్ కలిశారు. సుమారు 40 నిముషాల పాటు అమిత్ షా తో జగన్ సమావేశమయ్యారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 9:30 గంటలకు జగన్ విజయవాడకు బయలుదేరుతారని మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ, పర్యటనలో మార్పు చేసుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ భేటీ అయ్యారు.
తొలుత నిర్మల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఉదయాన్నే ఏపీ బయల్దేరాలని జగన్ భావించారు. కానీ ఆ తర్వాత నిర్మల అపాయింట్‌మెంట్ అందడం తో భేటీ అయ్యారు. మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పెండింగ్ నిధులతోపాటు గ్రాంట్లు విడుదల చేయాలని నిర్మలను జగన్ కోరినట్లు తెలుస్తోంది. కాగా, 15 రోజుల వ్యవధిలో జగన్ రెండు సార్లు ఢిల్లీకి వెళ్లడం చర్చగా మారింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు