ఇక ఆన్‌లైన్‌లో స్కెంజెన్ వీసాల దరఖాస్తు..!
- March 30, 2023
యూఏఈ: స్కెంజెన్ దేశాలకు వెళ్లాలనుకునే యూఏఈ నివాసితులు అపాయింట్‌మెంట్‌ల కోసం ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. క్యూలో నిలబడి వీసాలను ప్రాసెస్ కోసం పాస్‌పోర్ట్‌లను సమర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే EU పర్మిట్ విధానాన్ని డిజిటలైజ్ చేయడానికి ఒక అడుగు దూరంలో ఉంది. EU సభ్య దేశాలు బుధవారం వీసా విధానాన్ని డిజిటలైజ్ చేసే ప్రతిపాదనపై చర్చించారు. ఈ కొత్త విధానం ఆన్‌లైన్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వీడిష్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనెర్గార్డ్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కెంజెన్ వీసా చట్టబద్ధమైన ప్రయాణికులు దరఖాస్తు చేసుకోవడానికి సులభతరం చేస్తుందన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం వీసా మోసాలను తగ్గిస్తుందని తెలిపారు. ఆన్ లైన్ లో వీసా దరఖాస్తు కోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం.. వీసాలను డిజిటల్ ఫార్మాట్‌లో 2D బార్‌కోడ్‌గా, క్రిప్టోగ్రాఫికల్ సంతకంతో జారీ చేయనున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







