PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు

- March 30, 2023 , by Maagulf
PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు

ప్రవాసంలో నివసిస్తూ, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలయిన కూచిపూడి, భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు, తెలుగు విశ్వ విద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ద్వారా పరీక్షలు నిర్వహించి, అకడమిక్ క్రెడిట్స్ తో కూడిన జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికెట్స్ అందించే సంస్థ SAMPADA (Silicon Andhra Music Performing Arts and Dance Academy).ఈ విద్యాసంవత్సరం  4000 మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించింది.    

 25 మార్చి2023 న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధికారుల పర్యవేక్షణలో, అమెరికాలోని క్యాలిఫోర్నియా, లాస్ ఏంజిలస్, డాలస్, చికాగో, న్యూజెర్సీ, వర్జీనియా వంటి నగరాలతో పాటు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అంతర్జాలం ద్వారా, దాదాపు 3650 మంది కి పైగా విద్యార్ధులకు జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్, లెవల్ 1 మరియు లెవల్ 3 పరీక్షలు నిర్వహించడం జరిగింది.

విద్యార్ధులకు ప్రత్యక్షంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, విశ్వ విద్యాలయ అధికారులు, విద్యార్ధులు,తల్లి దండ్రులు, విద్యార్ధులకు శిక్షణ ఇచ్చిన గురువుల ప్రశంసలను అందుకున్నదని, ఈ పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సంపద కీలక బృంద సభ్యులయిన  ఫణిమాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి, జయమాధవి పూనుగంటి, తెలుగు విశ్వ విద్యాలయ  రిజిస్ట్రార్ డా. భట్టు రమేష్ గారు,పరీక్షల నియంత్రణ అధికారి డా.  మురళీ కృష్ణ, అంతర్జాతీయ తెలుగు కేంద్రం నిర్వహణాధికారి డా. రెడ్డి శ్యామల గారి   పర్యవేక్షణలో,  నృత్య విబాగం అధిపతి డా. వనజ ఉదయ్, అధ్యాపకులు డా. విజయపాల్,  సంగీత విభాగం అధిపతి డా. రాధ సారంగపాణి, అధ్యాపకులు డా. వెంకటాచారి గార్ల  సహకారంతో నిర్వహించామని సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. వివిధ రాష్ట్రాలనుండి సహకారం అందించిన శరత్ వేట, సుజాత అప్పలనేని, మాధురి దాసరి, వంశీ నాదెళ్ళ, శ్యాం శశిధర్ కొండుభట్ల, స్రుజన నాదెళ్ల, సూరజ్ దసిక, ఇందిరా, శ్రీవల్లి కొండుభట్ల తదితరులకు ధన్యవాదాలు తెలియజేసారు.  

ఈ పరీక్షలు నిర్వహణను ముందుండి దిశా నిర్దేశం చేసిన తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ డా. తంగెడ కిషన్ రావ్ కి  ధన్యవాదాలు తెలుపుతున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కాదలచిన  విద్యార్ధులు http://www.sampada.siliconandhra.org వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని సంపద డీన్ మరియు అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల ఒక ప్రకటనలో తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com