భారత్ లో కొత్తగా 3,095 కరోనా కేసులు
- March 31, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా3,095 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఒక్కరోజులో మూడు వేల పైచిలుకు కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండోసారి. బుధవారం కూడా మూడువేల పైచిలుకు కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతికదూరం నిబంధనను కచ్చితంగా పాటించాలని కేంద్రం సూచించింది.
ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర వరకూ ఉన్న ఆసుపత్రులు హైఅలర్ట్‌లో ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎక్స్‌బీబీ వేరియంట్ కారణమని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే, కొత్త వేరియంట్ ఏదీ వెలుగులోకి రాలేదని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ ఘాజియాబాద్ జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కేరళలోని ఎర్ణాకులం, తిరువనంతపురం జిల్లాలు కేసుల సంఖ్య పరంగా టాప్‌లో ఉన్నాయి. గోవాలో గురువారం కొత్తగా 108 కేసులు వెలుగులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







