ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్
- March 31, 2023
న్యూ ఢిల్లీ: దోమలు రాకుండా పెట్టిన మస్కిటో కాయిల్..ఏకంగా ఆరుగురి ప్రాణాలు తీసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకుంది. శాస్త్రిపార్క్‌లోని ఓ ఇంట్లో దోమలు రాకుండా మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోయారు. అది ఉన్నట్టుండి పరుపుపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని ఇల్లంతా వ్యాప్తి చెందాయి. ఆ మంటలకు వాళ్లకు ఊపిరాడలేదు. శ్వాస తీసుకోలేక కోమాలోకి వెళ్లిపోయి ప్రాణాలొదిలారు. ఆ కాయిల్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కారణంగానే శ్వాస అందక చనిపోయారని వైద్యులు వెల్లడించారు.
'రాత్రి సమయంలో తలుపులు, కిటికీలు అన్ని మూసివేసి.. మస్కిటో కాయిల్స్ వెలిగించారు. పరుపుపై మస్కిటో కాయిల్ పడటంతో మంటలు చెలరేగాయి. మస్కిటో కాయిల్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడింది. ఈ విషపూరిత పొగతో కుటుంబంలోని వారంతా స్పృహ కోల్పోయారు. తర్వాత వారు ఊపిరాడక మరణించారు' అని సీనియర్ ఆఫీసర్ జోయ్ టిర్కే చెప్పారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని వివరించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







