జహ్రాలో కాన్సులర్, మెడికల్ క్యాంపులు సక్సెస్

- April 01, 2023 , by Maagulf
జహ్రాలో కాన్సులర్, మెడికల్ క్యాంపులు సక్సెస్

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం మార్చి 31వ తేదీ శుక్రవారం జహ్రాలోని వాహా ప్రాంతంలోని డోడీ కిడ్స్ నర్సరీ స్కూల్‌లో నిర్వహించిన కాన్సులర్, మెడికల్ క్యాంప్‌ విజయవంతం అయింది. ఈ క్యాంపులకు పెద్ద సంఖ్యలో భారతీయ కమ్యూనిటీ ప్రజలు తరలివచ్చారు. కాన్సులర్ క్యాంప్ లో పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, PCC, ఆన్-ది-స్పాట్ అటెస్టేషన్ సేవలతో సహా ఇతర కాన్సులర్ సేవలను పొందారు. రాయబార కార్యాలయం నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ (IDF) కువైట్‌లోని సీనియర్ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, కన్సల్టింగ్ సేవలను అందించారు. కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ డా. ఆదర్శ్ స్వైక మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. మారుమూల ప్రాంతాలలో కాన్సులర్ సేవలను అందించడానికి ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని డా. ఆదర్శ్ స్వైక తెలిపారు.  అంతకుముందు ఫిబ్రవరిలో వాఫ్రా ప్రాంతంలో కూడా ఇలాంటి శిబిరాలనే ఇండియన్ ఎంబసీ నిర్వహించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com