రస్ అల్ ఖైమాలో స్పీడ్ హంప్స్
- May 07, 2016
రోడ్లపై రయ్యిన దూసుకుపోయే వాహనాలతో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య తగ్గడంలేదు. ఈ కారణంగా కొన్ని చోట్ల స్పీడ్ హంప్స్ని ఏర్పాటు చేయాలని రస్ అల్ ఖైమా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ ఇంజనీరింగ్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ హెడ్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ సామ్ అల్ నక్బి మాట్లాడుతూ, కోర్నిచ్ అల్ కవాయిసమ్ రోడ్ మరియు షేక్ మహమ్మద్ బిన్ సలీమ్ రోడ్ డౌన్ టౌన్లో కొత్తగా స్పీడ్ హంప్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోడ్ హంప్స్ ఏర్పాటు చేసినా కొందరు వాహనదారులు మితిమీరిన వేగంతో వెళుతున్నారనీ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత వాహనదారులపైన కూడా ఉందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!







