సర్వమత ఇఫ్తార్‌లో పాల్గొన్న దౌత్యవేత్తలు, మతాధిపతులు
- April 03, 2023
యూఏఈ: అల్ మనార్ ఇస్లామిక్ సెంటర్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో అనేక మంది మిషన్‌లు, మత పెద్దలు, ఇతర అతిథులు హాజరయ్యారు. హిందూ దేవాలయం, గురునానక్ దర్బార్ గురుద్వారా, చర్చిల నుండి మత పెద్దలు... యూకే, అమెరికా, భారతదేశం, పాకిస్తాన్, కొరియా, జపాన్, రష్యా, కెనడా కాన్సులర్ అధిపతులతో పాటు అనేక ఇతర మతాల అధిపతులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సుల్ జనరల్ మేఘన్ గ్రెగోనిస్, డిప్యూటీ కాన్సుల్‌తో కలిసి వచ్చి సర్వమత ఇఫ్తార్‌లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ మత స్వేచ్ఛపై స్థాపించబడిందని, అమెరికాలో మొదటి దౌత్యవేత్త ఇఫ్తార్ విందు దాదాపు 200 సంవత్సరాల క్రితం వైట్ హౌస్‌లో జరిగిందని గ్రెగోనిస్ తెలిపారు. సర్వమత సామరస్యాన్ని నెలకొల్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా పలువరు దౌత్యవేత్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







