మస్కట్ ఎయిర్ పోర్టులో పెరిగిన విమానాలు, ప్రయాణికులు

- April 03, 2023 , by Maagulf
మస్కట్ ఎయిర్ పోర్టులో పెరిగిన విమానాలు, ప్రయాణికులు

మస్కట్: మస్కట్ వింటర్ సీజన్‌లో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం విమాన ప్రయాణికుల పెరుగుదలను నమోదుచేసింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం 2023 జనవరి నెలలో 1 మిలియన్ మార్క్ (అంతర్జాతీయ, దేశీయ) దాటింది.  నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ఆదివారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2023 జనవరిలో మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా అంతర్జాతీయ,  దేశీయ ఇన్‌బౌండ్ / అవుట్‌బౌండ్ విమానాలు 143 శాతం పెరిగి 7,687 విమానాలను చేరుకోగా.. విమాన ప్రయాణికుల సంఖ్య 1,051,390 దాటింది.  కాగా, జనవరి 2020 చివరి నాటికి మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం ప్రయాణీకుల సంఖ్య 1.43 మిలియన్లుగా ఉంది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సలాలా, సోహర్, దుక్మ్ విమానాశ్రయాల ద్వారా 2023 జనవరి చివరి నాటికి అంతర్జాతీయ ఇన్‌బౌండ్ / అవుట్‌బౌండ్ విమానాల సంఖ్య 8,537 విమానాలకు చేరుకుందని తాజా NCSI గణాంకాలు వెల్లడించాయి. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా వచ్చేవారి సంఖ్య 94 శాతం పెరిగింది. 2022లో ఇదే కాలంతో పోలిస్తే 2023 జనవరి చివరి నాటికి 115 శాతం పెరుగుదల నమోదైంది. జనవరి 2023 చివరి నాటికి మస్కట్, సలాలా, సోహర్, దుక్మ్ విమానాశ్రయాల ద్వారా వచ్చే, వెళ్లే మొత్తం ప్రయాణికుల సంఖ్య 1,165,556కి చేరుకుంది.

ఇదిలా ఉండగా.. సలాలా విమానాశ్రయం అంతర్జాతీయ, దేశీయ విమానాల సంఖ్య 43.1 శాతం పెరిగిందని నివేదకలో పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా 774 విమానాల ద్వారా 105,719 మంది ప్రయాణికులు ప్రయాణించారు. సోహార్ విమానాశ్రయంలో 24 విమానాల ద్వారా 2,380 మంది ప్రయాణికులు వచ్చి వెళ్లారు. ఇక దుక్మ్ విమానాశ్రయం నుంచి 52 దేశీయ విమానాల ద్వారా 6,067 మంది ప్రయాణికులు వచ్చి వెళ్లారని నివేదికలో తెలిపారు. మొత్తం 151,087 మంది ప్రయాణికులతో మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను దాటిన వారిలో భారతీయ జాతీయతకు చెందిన ప్రయాణికులు అగ్రస్థానంలో ఉండగా.. మొత్తం 52,016 మంది ప్రయాణికులతో బంగ్లాదేశ్ జాతీయులు,  39,762 మంది ప్రయాణికులతో పాకిస్థానీ జాతీయులు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com