బొటాక్స్ ఇంజెక్షన్లు దొంగిలించిన మహిళకు జైలుశిక్ష, Dh21,000 జరిమానా

- April 03, 2023 , by Maagulf
బొటాక్స్ ఇంజెక్షన్లు దొంగిలించిన మహిళకు జైలుశిక్ష, Dh21,000 జరిమానా

దుబాయ్: 34 ఏళ్ల మహిళ తాను పని చేసిన కాస్మెటిక్ క్లినిక్ నుండి బొటాక్స్ ఇంజెక్షన్లు, ఇతర ఉత్పత్తులను దొంగిలించినందుకు కోర్టు జైలుశిక్ష విధించింది. పోలీసు నివేదికల ప్రకారం.. బొటాక్స్, ఇతర కాస్మెటిక్ ఉత్పత్తులను రిసెప్షనిస్ట్ దొంగిలించిందని ఆరోపిస్తూ కాస్మెటిక్ క్లినిక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. క్లినిక్‌లోని ప్లాస్టిక్ సర్జన్ కు అనుమానం రావడంతో.. సెంటర్‌లోని ఉత్పత్తుల జాబితాను పరిశీలించారు. ఇందులో 21,000 దిర్హామ్‌ల విలువైన ఇంజెక్షన్ల కొరత ఉన్నట్లు గుర్తించినట్లు మేనేజర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెంటర్ లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. రిసెప్షనిస్ట్ సామాగ్రిని దొంగిలించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు నివేదిక సమర్పించి ఆధారాలను అందజేశారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ రిసెప్షనిస్ట్‌ను దోషిగా నిర్ధారించింది. ఆమెకు మూడు నెలల జైలుశిక్ష, బహిష్కరణ విధించింది. ఆమెకు 21,000 దిర్హామ్‌ల జరిమానాను కూడా కోర్టు విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com