రాహుల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. బెయిల్ మంజూరు
- April 03, 2023
సూరత్: మోడీ అనే ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించడం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఉంటోంది అని రాహుల్ వ్యాఖ్యలు చేయగా… గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, న్యాయవాది పూర్ణేశ్ మోదీ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులోనే రాహుల్ కు జైలుశిక్ష పడింది.
అయితే, ఈ పరువునష్టం కేసులో కింది కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువును ఏప్రిల్ 13 వరకు పొడిగించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. కాగా, నేటి విచారణకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







