వారంలో 1,564 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదు
- April 03, 2023
కువైట్ : మార్చి చివరి వారంలో 1,564 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదు అయినట్లు సాధారణ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. వీటిలో 234 తీవ్రమైనవని, 1,330 చిన్న ప్రమాదాలని పేర్కొంది. మార్చి 25 నుంచి మార్చి 31వ తేదీ వరకు 64 మంది నిర్లక్ష్యపు డ్రైవర్లపై కేసులు నమోదు చేశామని, 16 మంది బాలనేరస్థులను ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేసినట్లు, 179 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని, విచారణకు గైర్హాజరైన వారిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా షువైఖ్ పారిశ్రామిక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు.. అధిక శబ్దాలను విడుదల చేసే పరికరాలను వాహనదారులు అందజేసే రెండు వర్క్‌షాప్‌లను గుర్తించి మూసివేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







