ఆస్తమా రోగులకు శుభవార్త

- May 07, 2016 , by Maagulf
ఆస్తమా రోగులకు శుభవార్త

మీరు ఎన్ని మందులు వాడినా ఆస్తమా తగ్గడం లేదా? డాక్టర్లను మార్చినా రోగం తగ్గడం లేదా? అలాంటి వారి కోసం చిన్న చిట్కా. ప్రతిరోజూ కొంత సమయం యోగా కోసం వెచ్చిస్తే రోగం మటుమాయం అవుతుందని ఓ సర్వే వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమా, ఉబ్బసంతో బాధపడే వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఊపిరి పట్టేయడం, విపరీతమైన దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఇవ్వన్నీ ఆస్తమా రోగులకు ఉండే లక్షణాలు. ఒకసారి ఆస్తమా బారిన పడితే తగ్గడం అంత ఈజీ కాదు. మందుల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టే దానికన్నా యోగా చేస్తేచాలని అంటోంది చైనీస్ యూనివర్శిటీ. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా పేషెంట్ల సమస్యకు పరిష్కారం కోసం పరిశోధనలు చేసింది. వెయ్యిమంది పురుషులు, మహిళలతో వరుసగా యోగా చేయించింది. తద్వారా కొన్ని ఫలితాలు కనిపించాయని అధ్యయనంలో గుర్తించింది. యోగాసనాల వల్ల ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ తగ్గించడం కోసం వాడే మందులు పరిమాణం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. యోగా వల్ల ఆస్తమా రోగులపై ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవంటున్నారు. భారత్ లో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న యోగా ఆస్తమా రోగులకు వరం లాంటిదని హాంగ్ కాంగ్ లో చైనీస్ యూనివర్శిటీ తేల్చడం విశేషం. ఆరు నెలలపాటు యోగాసనాలతో పాటు ధ్యానం వల్ల మెరుగైన ఫలితం కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com