గాయాలతోనే విధులకు హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర... ఆరా తీసిన చంద్రబాబు
- May 07, 2016
టీడీపీ కీలక నేత, ఏపీ ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం రాత్రి తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో గుంటూరు జిల్లా పరిధిలో ఆయన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్రతో పాటు మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మంత్రి అనుచరులు ఆయనను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత రవీంద్ర విజయవాడ వచ్చేశారు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానీ కొల్లు రవీంద్ర మాత్రం ఆ దుర్ఘటన నుంచి క్షణాల్లో తేరుకున్నారు. నిన్న విజయవాడలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడితో కలిసి హాజరయ్యారు. రవీంద్ర గాయపడ్డారన్న సమాచారంతో ఆయన కనిపించగానే చంద్రబాబు పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రమాదాన్ని చంద్రబాబుకు వివరించిన రవీంద్ర... తనకైన గాయాలు స్వల్పమైనవేనని చెప్పడమే కాకుండా వాటిని చంద్రబాబుకు చూపించారు. ఈ సందర్భంగా మిగిలిన మంత్రులు, టీడీపీ నేతలు కూడా రవీంద్రను పరామర్శించారు.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







