భారతీయ యువకుడికి 5 మిలియన్ దిర్హామ్‌ల పరిహారం
- April 06, 2023
యూఏఈ: మూడు సంవత్సరాల క్రితం ఒమన్ నుండి దుబాయ్‌కి ప్రయాణిస్తుండగా జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ యువకుడికి 5 మిలియన్ దిర్హామ్‌ల పరిహారం లభించింది. ఆ సమయంలో 20 సంవత్సరాల వయస్సులో ఉన్న ముహమ్మద్ బేగ్ మీర్జా విషాదకరమైన ప్రమాదంతో అతను ఆరోగ్యకరమైన జీవితాన్ని కోల్పోయాడు. అతని న్యాయవాదుల ప్రకారం, యూఏఈ ఇన్సూరెన్స్ అథారిటీ, ప్రాథమిక రాజీ కోర్టు అతనికి మొదట 1 మిలియన్ దిర్హాన్‌లను పరిహారంగా అందించింది. పిటిషనర్లు దుబాయ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టును ఆశ్రయించి 5 మిలియన్ దిర్హామ్‌ల పరిహారాన్ని పొందారు. కాగా ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీమా కంపెనీ రెండుసార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి తీవ్ర నిరాశ ఎదురైంది.
జూన్ 2019లో ఒమన్ నుండి యూఏఈకి వస్తున్న బస్సు దుబాయ్‌లో షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుండి అల్ రషీదియా మెట్రో స్టేషన్ పార్కింగ్ ఎంట్రీ పాయింట్ వద్ద ఉంచిన ఓవర్ హెడ్ హైట్ బారియర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు ఎగువ-ఎడమ భాగం పూర్తిగా ధ్వంసమైంది. మొత్తం 31 మంది ప్రయాణికులలో 17 మంది మరణించారు. వీరిలో 12 మంది భారతీయులు ఉన్నారు. ఈద్ అల్ ఫితర్ సెలవులను తన తల్లి బంధువులతో గడిపి మస్కట్ నుండి తిరిగి వస్తుండగా ఇంజనీరింగ్ విద్యార్థి మీర్జా తీవ్రంగా గాయపడ్డాడు. అతను రెండు నెలలకు పైగా దుబాయ్‌లోని రషీద్ హాస్పిటల్‌లో చికిత్స పొందాడు. 14 రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత కూడా పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాలో భాగంగా చివరి సెమిస్టర్ పరీక్షకు సిద్ధమవుతున్న మీర్జా తన చదువును పూర్తి చేయలేకపోయాడు. ప్రమాదంలో అతడి మెదడుకు గాయాలు అయినట్లు, సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. మీర్జా మెదడుకు 50 శాతం నష్టం వాటిల్లిందని ఇచ్చిన నివేదిక ఆధారంగా యూఏఈ సుప్రీం కోర్టు బీమా కంపెనీకి పరిహారం చెల్లించాలని ఆదేశించింది."తీర్పుతో మేము చాలా సంతోషంగా ఉన్నాము" అని సీనియర్ కన్సల్టెంట్ ఈసా అనీస్ అన్నారు. ఈ ప్రమాదం కారణంగా అతను, అతని కుటుంబం మానసికంగా, సామాజికంగా.. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూశారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఒమన్‌కు చెందిన డ్రైవర్‌కు 7 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్‌ల బ్లడ్ మనీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







