లైసెన్స్ లేకుండా ఆ పనిచేస్తే.. Dh1 మిలియన్ జరిమానా, 5 ఏళ్ల జైలుశిక్ష
- April 06, 2023
యూఏఈ: లైసెన్స్ లేకుండా డబ్బు వసూలు చేసినందుకు జరిమానా గురించి యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ ద్వారా వివరించింది. పుకార్లు, సైబర్ క్రైమ్‌లను ఎదుర్కోవడంపై 2021 ఫెడరల్ డిక్రీ లా నంబర్. 34లోని ఆర్టికల్ నెం. 41 ప్రకారం, పోటీ లేదా క్రిప్టోకరెన్సీ కోసం ఆహ్వానించే లేదా ప్రోత్సహించే వ్యక్తి లేదా నకిలీ కంపెనీ లేదా పోర్ట్‌ఫోలియోను సృష్టించే లేదా నిర్వహించే వ్యక్తి పెట్టుబడి, నిర్వహణ, వినియోగం లేదా అభివృద్ధి కోసం ప్రజల నుండి డబ్బును స్వీకరించడం లేదా సేకరించడం - సంబంధిత అధికారులచే లైసెన్స్ పొందకుండా - జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించింది. జైలు శిక్ష ఐదేళ్లకు మించకుండా ఉంటుందని.. అపరాధికి Dh250,000 కంటే తక్కువ కాకుండా.. 1 మిలియన్ దిర్హాలకు మించకుండా పెనాల్టీ విధించే అవకావశం ఉందని తెలిపింది. ఈ పోస్ట్ ద్వారా యూఏఈ నివాసితులలో చట్టపరమైన సంస్కృతిని ప్రోత్సహించడానికి, దేశంలోని తాజా చట్టాల గురించి వారి అవగాహనను పెంచడానికి నిరంతర ప్రయత్నాలలో భాగం అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలియజేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







