వచ్చే వారం ఉరుములతో కూడిన వర్షాలు, చలిగాలులు..!

- April 06, 2023 , by Maagulf
వచ్చే వారం ఉరుములతో కూడిన వర్షాలు, చలిగాలులు..!

కువైట్: వచ్చే వారంలో కువైట్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా బుధవారం నుంచి శనివారం వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాస్త్రవేత్త ఇస్సా రంజాన్ తెలిపారు. అదే విధంగా ఆదివారం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం సరయత్ సీజన్‌ నడుస్తోందని, ఇది ఏప్రిల్ 14న ముగుస్తుందన్నారు. అయితే,  ఇది మే చివరి వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది సారయత్ సీజన్‌లో వర్షాలు కురుస్తాయని, ఆ కాలంలో ఎన్నడూ లేని విధంగా చలిగాలులు కూడా వీచే అవకాశం ఉందని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com