AFC ఆసియా కప్ ఖతార్ 2023: తేదీలు, వేదికలు ఖరారు

- April 06, 2023 , by Maagulf
AFC ఆసియా కప్ ఖతార్ 2023: తేదీలు, వేదికలు ఖరారు

కౌలాలంపూర్: 2024 జనవరి 12 నుండి ఫిబ్రవరి 10 వరకు  AFC ఆసియా కప్ ఖతార్ 2023 18వ ఎడిషన్ పోటీలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) ప్రకటించింది. ఆసియాలోని టాప్ 24 దేశాలు ఆసియా ఫుట్‌బాల్‌ ట్రోపీ కోసం పోటీలో ఉన్నాయి.   ఈ పోటీలు ఎనిమిది స్టేడియాలలో జరుగనున్నాయి. వీటిలో ఆరు FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 ను నిర్వహించిన వేదికలు కూడా ఉన్నాయి. అల్ జనోబ్ స్టేడియం, అల్ బైట్ స్టేడియం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం, అల్ తుమామా స్టేడియం, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం.. అలాగే జస్సిమ్ బిన్ హమద్ స్టేడియం, అబ్దుల్లా బిన్ ఖలీఫా స్టేడియాలలో పోటీలు నిర్వహించనున్నట్లు AFC అధ్యక్షుడు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా తెలిపారు. స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ, ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆసియా ఫుట్‌బాల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు. AFC ఆసియా కప్ ఖతార్ 2023 30 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఇది ఆసియాలోని ఫుట్ బాల్ అభిమానులను అలరించనుంది. ఇదిలా ఉండగా.. AFC ఆసియా కప్ ఖతార్ 2023కి సంబంధించిన అధికారిక డ్రా వేడుకను 2023 మే 11న మధ్యాహ్నం 2 గంటలకు దోహాలోని ప్రపంచ ప్రఖ్యాత కటారా ఒపెరా హౌస్‌లో నిర్వహించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com