700,000 దిర్హామ్‌లను దోచుకున్న నలుగురికి జైలుశిక్ష
- April 06, 2023
దుబాయ్: దుబాయ్‌లోని నైఫ్ ప్రాంతంలోని ఎలక్ట్రానిక్స్ కంపెనీ నుండి 709,000 దిర్హామ్‌లను దొంగిలించినందుకు ఆసియా జాతీయతకు చెందిన నలుగురు దొంగలు జైలు పాలయ్యారు. పోలీసు రికార్డుల ప్రకారం ఈ కేసు గత డిసెంబర్ నాటిది. ఓ వ్యక్తి తన ఎలక్ట్రానిక్స్ దుకాణాన్ని నలుగురు వ్యక్తులు బలవంతంగా దోచుకున్నారని ఫిర్యాదు దాఖలు చేశారు. తన ఉద్యోగి ఒకరు తనకు ఫోన్ చేసి సీఐడీ ఆఫీసర్లుగా నటిస్తున్న నలుగురి ముఠా దుకాణానికి వచ్చి సేఫ్ లాకర్ తెరవమని బలవంతం చేశారని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత వారు Dh709,000 దొంగిలించి పారిపోయారని పేర్కొన్నారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి నిఘా ఫుటేజీతో సహా ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. నలుగురు దొంగలను గుర్తించి, వారిలో ముగ్గురిని పొరుగున ఉన్న ఎమిరేట్‌లోని ఒక హోటల్లో అరెస్టు చేశారు. వారివద్ద నుంచి Dh600,000 రికవరీ చేశారు. ఎలక్ట్రానిక్స్ స్టోర్ నుండి దొంగిలించబడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. నలుగురు దొంగలకు(ఒక దొంగ గైర్హాజరులో) రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే వారికి Dh709,000 జరిమానా విధించారు. శిక్షను అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









