వారంలో SR12 బిలియన్లు ఖర్చుపెట్టిన సౌదీ రెసిడెంట్స్
- April 06, 2023
రియాద్ : సౌదీ అరేబియాలో నివసిస్తున్న పౌరులు, నివాసితులు మార్చి 26 నుండి ఏప్రిల్ 1 వరకు ఒక వారంలో SR12 బిలియన్లు ఖర్చు చేశారని సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ప్రకటించింది. పాయింట్స్ ఆఫ్ సేల్ (PoS) ద్వారా 150.2 మిలియన్ లావాదేవీలు జరిగాయన్నారు. ఇందులో రెస్టారెంట్లు, కేఫ్‌లపై SR1.2 బిలియన్లు ఖర్చు చేయగా.. ఆహారం, పానీయాలపై SR2.1 బిలియన్లు ఖర్చు చేశారు. అలాగే ప్రజలు బట్టలు, బూట్ల కోసం SR1.4 బిలియన్లు, నిర్మాణం కోసం SR317.1 మిలియన్లు, నిర్మాణ సామగ్రిపై SR317.1 మిలియన్లు ఖర్చు చేశారని సెంట్రల్ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. ప్రజలు విద్య కోసం SR152.5 మిలియన్లు, ఇ-డివైజ్‌ల కోసం SR256.3 మిలియన్లు, గ్యాస్ స్టేషన్‌లపై SR730.3 మిలియన్లు మరియు ఆరోగ్యంపై SR844.2 మిలియన్లు ఖర్చు చేశారని తెలిపింది.
సౌదీ అరేబియాలోని ప్రజలు ఫర్నిచర్ కోసం SR348.3 మిలియన్లు, హోటళ్లపై SR322 మిలియన్లు, పబ్లిక్ యుటిలిటీలపై SR1.5 బిలియన్లు, నగలపై SR251.9 మిలియన్లు మరియు వివిధ వస్తువులు, సేవలపై SR1.3 బిలియన్లు ఖర్చు చేశారు. వినోదం, సంస్కృతిక కార్యక్రమాలపై SR295.3 మిలియన్లు, కమ్యూనికేషన్‌లపై SR126.3 మిలియన్లు, రవాణాపై SR764.3 మిలియన్లు, ఇతర కార్యకలాపాల కోసం SR2 బిలియన్లు ఖర్చు పెట్టారని సౌదీ సెంట్రల్ బ్యాంకు తెలియజేసింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







