కువైట్ లో పెరిగిన వాహన బీమా రుసుములు
- April 06, 2023
కువైట్: 2023 ఏప్రిల్ 16 నుండి ప్రైవేట్ వాహనాల వార్షిక బీమాను KD 19 నుండి KD 32కి పెంచే నిర్ణయాన్ని కువైట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ ఆమోదించింది. ప్రైవేట్ యాజమాన్యంలోని (వ్యక్తిగతం కాని) వాహనాల వార్షిక ప్రాథమిక బీమా ప్రీమియం KD 53కి పెంచినట్లు వెల్లడించింది. రెగ్యులేటరీ యూనిట్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ కార్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అభివృద్ధి తర్వాత తప్పనిసరి బీమా పాలసీ రేట్లను సవరించడంతోపాటు అనేక నిర్ణయాలను ఆమోదించింది. బీమా క్లెయిమ్ పూర్తయిన తేదీ నుండి గరిష్ఠంగా 10 పనిదినాల లోపు పరిహారం పొందే కాలాన్ని కూడా కమిటీ నిర్ణయించింది. నివేదిక ప్రకారం.. సరిహద్దుల గుండా ప్రవేశించే నాన్-కువైట్ లైసెన్స్ ప్లేట్లతో ప్రైవేట్ కార్లు, మోటార్‌సైకిళ్ల బీమా పాలసీ ఇప్పుడు వారానికి KD 12 లేదా సంవత్సరానికి KD 120గా నిర్ణయించారు. టాక్సీలకు వారానికి KD 20 లేదా సంవత్సరానికి KD 140, ప్రజా రవాణా వాహనాలకు వారానికి KD 16 లేదా సంవత్సరానికి KD 183, కార్గో వాహనాలకు KD 30 లేదా సంవత్సరానికి KD210 వసూలు చేయనున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









