బండి సంజయ్ రిమాండ్ పై విచారణ 10కి వాయిదా: హైకోర్టు
- April 06, 2023
హైదరాబాద్: 10వ తరగతి క్వశ్చన్ పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక అది లీకేజ్ ఎలా అవుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు బండి సంజయ్ చేసిన తప్పేంటని అడిగింది. పేపర్ బయటకు వచ్చాక వాట్సాప్‌లో ఫార్వార్డ్ మాత్రమే చేశాడని…కానీ పేపర్ లీకేజీలో బండి సంజయ్ పాత్ర లేదు కదా అని చెప్పింది. పేపర్ బయటకు వచ్చాక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని పేర్కొంది. 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు…. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది.
ఇప్పటికే కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని బండి సంజయ్ తరపు న్యాయవాది రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. దానిపై ఏప్రిల్ 06వ తేదీనే తీర్పు వచ్చేలా ఆదేశాలని ఇవ్వాలని కోరారు. మార్చి8వ తేదీన ప్రధాని మోడీ పర్యటన ఉండటంతో .. సంజయ్‌పై కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరారు.దీని పై హైకోర్టు స్పందిస్తూ.. కింది కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









