నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది:హోం మంత్రి మహమూద్ అలీ
- April 06, 2023
హైదరాబాద్: నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏ.సి.ఎస్ నగర్ లో రూ. 336 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 48 డబుల్ బెడ్ రూం ఇళ్లను గురువారం హోం మంత్రి డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 ప్రాంతాల్లో ఒక లక్ష గృహాలు నిర్మించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే రెండు పడకల గదుల నిర్మాణాలు చేపట్టి అందజేయడం జరుగుతుందని తెలిపారు. చేపట్టిన గృహ నిర్మాణ సముదాయాలలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు మాట్లాడుతూ... నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా అందజేస్తున్నారని, డబుల్ బెడ్ రూం ఇళ్లు రాని వారు నిరాశ చెందవద్దని, ఇక్కడ స్థలం కొరత ఉన్నందున తక్కువ డబుల్ బెడ్ రూం లు నిర్మించడం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న వారికి బండ్లగూడ, జవహర్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను రాని వారికి ఇస్తామని హామీ ఇచ్చారు. అడ్డగుట్ట బస్తీవాసుల కోరిక మేరకు ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబాలకు నిలువ నీడ కల్పించేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లో అర్హులైన వారందరికీ 2 BHK గృహాలను అందించడం జరుగుతుందని ఇప్పటి వరకు సుమారు 500 మంది కి అర్హులైనవారికి పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మి, ఆర్. సునీత, సామల హేమ, హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్ కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!







