అనేక ఆకర్షణలతో కొత్త Dh1,000 నోటు విడుదల
- April 07, 2023
యూఏఈ: మార్కెట్లో చెలామణి కోసం పాలిమర్‌తో తయారు చేయబడిన Dh1,000 డినామినేషన్ కొత్త నోటును యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) విడుదల చేసింది. కొత్త నోటు ఏప్రిల్ 10 నుండి బ్యాంకులు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కొత్త నోటు రూపకల్పనలో CBUAE యూఏఈ విజయగాథను హైలైట్ చేశారు. ప్రపంచ విజయాలను ప్రతిబింబించే సాంస్కృతిక, అభివృద్ధి చిహ్నాలతో పాటు ఇతర చిత్రాలను ఉపయోగించారు. కొత్త నోటు రూపకల్పనలో అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా ఉన్న యూఏఈ వాస్తవిక ఆశయాలను పొందుపరిచారు. యూఏఈ బ్రాండ్ ఫ్లోరోసెంట్ బ్లూ గుర్తులతో పాటు అధునాతన ఇంటాగ్లియో ప్రింటింగ్ పద్ధతులను ఉపయోగించి రూపొందించిన డ్రాయింగ్‌లతో కొత్త నోటును రూపొందించారు. కొత్త నోటు ముందు వైపు దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్, 1974లో నాసా పయినీర్లతో జరిగిన సమావేశం నుండి ప్రేరణ పొందిన స్పేస్ షటిల్ మోడల్ చిత్రం ఉంది. కొత్త నోటు వెనుక భాగంలో అబుధాబిలోని బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ చిత్రం ఉంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







