దుబాయ్ రాయల్ వెడ్డింగ్: ఒక్కటికానున్న షేక్ మహ్రా, షేక్ మన..!
- April 07, 2023
దుబాయ్: తన కుమార్తె షేఖా మహ్రా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వివాహం షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌తో జరుపనున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధికారికంగా ప్రకటించారు. వరుడి తండ్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ నూతన వధూవరుల కోసం రాసిన అందమైన కవితను షేఖా మహ్రా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇదే కవితను షేక్ మనా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇద్దరు రాజకుటుంబాల మధ్య వివాహం ఖరారైన నేపథ్యంలో ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షేఖా మహరా యూకే నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో డిగ్రీ కూడా చేసారు. షేక్ మనా ఒక వ్యాపారవేత్త . అతను దుబాయ్‌లో రియల్ ఎస్టేట్, టెక్నాలజీలో అనేక విజయవంతమైన వెంచర్లలో భాగస్వామిగా ఉన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







